ఇద్దరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి..
మంగళగిరి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వైఎస్ ఆర్సిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టడిపిలో చేరారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టిరా్ భవన్లో ఈ ఇద్దరితో పాటు మాజి ఎమ్మెల్యే, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు, పార్టీ నేతలు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.