నా కాన్వాయ్ వెళ్లే దారిలో ముందుగానే వాహానాలను నిలిపేయవద్దు.. సిఎం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ వెళ్లే దారిలో ముందే వాహనాలను నిలిపివేయొద్దని పోలీసులకు సూచించారు. నాకోసం వాహనదారులను ఇబ్బందిపెట్టొద్దని అన్నారు. దీని వల్ల వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారని.. ఈ విషయంలో మినహాయింపులు కల్పించే విషయంలో ఆలోచన చేయాలని రాష్ట్ర పోలీసు అధికారులకు సూచించారు. సిఎం కాన్వాయ్ బయల్దేరే కొద్ది సేపటి ముందు వరకు వాహనాల రాకపోకలకు అనుమతించాలని, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు సిఎం పలు సూచనలు చేశారు. వీటికి అనుగుణంగా ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.