NIA: ఎనిమిది మంది ISIS ఏజెంట్లు అరెస్టు
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/NATIONAL-INVESTIGATION-AGENCY.jpg)
NIA : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA).. ఇస్లామిక్ స్టేట్ (ISIS) తో సంబంధం ఉన్న ఎనిమిది మంది ఏజెంట్లను అరెస్టు చేసినట్లు సమాచారం. వీరు ఐసిస్ బళ్లారి మాడ్యూల్‌కు చెందిన వారని తెలిపారు. సోమవారం ఎన్ ఐఎ అధికారులు సోమవారం మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్కండ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. బళ్లారి మాడ్యూల్‌పై గత వారంలో ఎన్ ఐఎ కేసు నమోదు చేసి.. అప్పటినుండి నిందితుల కోసం సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రామంలో ఎనిమిది మందని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వారివద్ద నుండి భారీగా పేలుడు పదార్థాల నిల్వలు, మారణాయుధాలు, నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి మాడ్యూల్ లీడర్ మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. కళాశాల విద్యార్దులను ఉగ్ర కార్యకలాపాల దిశగా ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. గత వారం ఎన్ ఐఎ మహారాష్ట్రలోని 40 ప్రదేశాలలో దాడులు నిర్వహించి, 15 మందిని అనుమానితులను అరెస్టు చేశారు.