‘సలార్’ టికెట్ల ధర పెంపుకు తెలుగు రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూన్న చిత్రం సలార్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల విక్రయాలు కూడా షురూ అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో సలార్ టికెట్ల ధరల పెంపుకు రెండు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. తెలంగాణలో డిసెంబర్ 22 నుండి 28 వరకు మల్టిప్లెక్స్‌ల్లో రూ. 100, సింగిల్ థియేటర్లలో రూ. 65 వరకు పెరుగుదల ఉంటుంది. రాష్ట్రంలోని 20 థియేటర్లలో మాత్రమే అర్ధరాత్రి 1 గంకు బెనిఫిట్ షోకు అనుమతినిచ్చింది. అంతేకాకుండా సాధారణ ప్రదర్శనలతోపాటు అదనంగా ఉదయం 4 గంటల నుండి ఆరో ఆట ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.
ఎపిలో సలార్ మూవి టికెట్ ధరను రూ. 40 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా విడుదలైన రోజు నుండి 10 రోజులు ఈ టికెట్ ధరలు అములులో ఉండనున్నాయి. అధనపు షోలకు అనుమతి లేదు.