తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రం..
రాష్ట్ర అప్పులు రూ. 6,71,757 కోట్లు
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/bhatti-1-750x430.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని శాసనసభలో విడుదల చేశారు. శాసససభ సమావేశాలు ప్రారంభమయిన అనంతరం 42 పేజీల శ్వేతపత్రాన్ని సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధింయుకున్నామని, గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని తెలిపారు. దశాబ్ధ కాలంలో జరిగిన ఆర్ధిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, ఆర్ధిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామన్నారు. ఈ సవాళ్లను అధిగమించే దిశలో శ్వేతపత్రం తొలి అడుగు అని భట్టి అన్నారు.
రాష్ట్ర అప్పులు రూ. 6,71,757 కోట్లు.. 2014-2015 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు.. రోజువారీ ఖర్చులకు ఓడి ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని డిప్యూటి సిఎం అన్నారు.