మూడు న్యాయ సంహిత బిల్లులకు లోక్‌సభ ఆమెదం
ఢిల్లీ (CLiC2NEWS): ఐపిసి, సిఆర్‌సిపి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టులో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), నేర శిక్షాస్మృతి (సిఆర్‌పిసి), సాక్ష్యాధార చట్టం ( ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం అవడంతో తాజాగా ఈ శీతాకాల సమావేశాల్లో కేంద్రం వీటిని వెనక్కి తీసుకుంది. వాటికి కొన్ని మార్పులు చేసి భారతీయ న్యాయ (రెండో) సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా (రెండో) సంహిత, భారతీయ సాక్ష్యా (రెండో) బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను లోక్‌సభ ఆమోదించండంతో రాజ్యసభకు పంపనున్నారు. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకంతో బిల్లులు చట్టంగా మారతాయి.