ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డుప్ర‌మాదం.. న‌లుగురు మృతి

ప్ర‌కాశం (CLiC2NEWS): జిల్లాలోని పెద్దార‌వీడు మండ‌లం దేవ‌రాజుగ‌ట్టు వద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదాం జ‌రిగింది. శుక్ర‌వారం సాయంత్రం కారు , ఆటో ఢీకొన్న‌ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి చెందారు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దేవ‌రాజుగ‌ట్టు జాతీయ రాహ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. గాయ‌ప‌డిన వారిని మార్కాపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కారులో ప్ర‌యాణిస్తున్న నాగేశ్వ‌ర‌రావు, వెంక‌టేశ్వ‌ర్లు గుంటూరు చెందిన‌వారు. ఆటోలో ప్ర‌యాణిస్తున్న మార్కాపురం ప‌ట్ట‌ణానికి చెందిన‌ షేక్‌బాబు, ఆమ‌ని గుడిపాడుకు చెందిర అభిన‌య్‌గా గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.