డిసెంబర్ 30న పట్టాలెక్కనన్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్..
ఢిల్లీ (CLiC2NEWS): త్వరలో అమృత భారత్ ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ రైళ్లును ప్రారంభించనున్నారు. ముందుగా రెండు రైళ్లు పట్టాలెక్కనున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి ఢిల్లీ-దర్భంగా (బిహార్) మార్గంలో ప్రయాణించనున్నది. మరొక అమృత్ భారత్ బెంగాల్లోని మాల్దా-బెంగళూరు మధ్య సేవలందించనున్నట్లు సమాచారం. మరోవైపు ఆయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి డిసెంబర్ 30వ తేదీన ప్రారంభించనున్నారు. అదేరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించనున్నారు.