శీతాకాలంలో చేయదగిన వ్యాయామాలు
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉండేందుకు శారీరక పరంగా,మానసిక పరంగా, ఆరోగ్యపరంగా ఉండటానికి,మరియు శరీరానికి చలికాలంలో వచ్చేటటువంటి జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి శరీరానికి ఎప్పటికప్పుడు వ్యాయామము ఉండాలి మరియు శరీర పోషణకు చక్కని ఆహారం కూడా తీసుకోవాలి. చలికాలం శరీరం వెచ్చగా ఉండటానికి ఏ పూటకి,ఆపూట ఆహారాన్ని వండుకొని వేడిగా ఉన్నప్పుడే తీసుకోవలెను, చల్లని పదార్థాలు గాని, కఫం చేసేటటువంటి ఆహార పదార్థాలు, మరియు ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు, ఐస్ క్రీమ్ లు పిజ్జాలు, బర్గర్లు, స్నేక్స్, మ్యాగీస్, నూడిల్స్, తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు, శరీరాన్ని వెచ్చగా ఉంచేటటువంటి అల్లము, మిరియాలు,తేనే చలికాలం లో తీసుకుంటే జలుబు, దగ్గు, కఫం,జ్వరం నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చును.
శరీరాన్ని, ఆరోగ్యపరంగా ఉంచేటందుకు, మరి రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి, ఈ క్రింది ఆసనం వేయవలెను.
మొన్న వచ్చిన వర్షాలకు, చలి గత నాలుగు రోజులనుంచి తీవ్రంగా పెరగడం జరిగినది. దానికి గాను పార్కులకు గాని, రోడ్లమీద గాని ఎవరు ఉదయం మార్నింగ్ వాకింగ్ కి వెళ్లడం లేదు, దీనివల్ల వారి శరీరానికి వ్యాయామం సరిగా ఉండటం లేదని చాలామంది బాధపడుతుంటారు,అలాంటి వారి కోసం ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఇంట్లోనే ఉంటూ చలికి, బయటికి వెళ్లకుండా చక్కగా హ్యాపీగా చేసుకునేందుకు కొన్ని ఆసనాలు. శ్రద్ధ శ్రీ యోగాచార్యులు షేక్ బహార్ అలీ గారు చెప్పే ఆసనాలు చక్కగా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుని శరీరాన్ని హెల్తీగా ఉంచుకోండి. శరీరాన్ని “ఫిట్‌గా, హీట్ గా ఉంచుకోవడానికి ముందుగా భుజంగాసనం వేయవలెను.
1. భుజంగాసనం.
ముందుగా సమాంతరంగా ఉన్న నేలపై యోగా మ్యాట్ వేయవలేను. దానిమీద బోర్లా పడుకోండి, రెండు అరచేతులని ఛాతికీ ఇరు ప్రక్కల నేలపై రెండు అరచేతులను ఆనించండి, మీ యొక్క శరీరం బరువు మొత్తం చేతుల మీదనే ఉంటుంది. తర్వాత నిదానంగా నడుము నుండి తల పైభాగం పైకి లేపుతూ శ్వాసను రెండు ముక్కులతో తీసుకుంటూ చాతిలో 5 నిముషాలు శ్వాసను బందించి ఉంచి, తల పైకి ఉంచి ఆకాశం వైపు చూస్తూ ఉండవలెను తిరిగి మరల ఐదు నిమిషాల తర్వాత యధాస్థితికి రావలెను. ఈ విధంగా మూడుసార్లు చేయవలెను.
భుజంగాసనం వలన ప్రయోజనాలు
వెన్నుముక యొక్క స్థితి స్థాపకత్వం వృద్ధి చెందును. అధిక శ్రమ వల్ల కలిగిన వీపునొప్పి నివారణ మగును. శ్వాసకోశ సంబంధము రొమ్ము పడిశము ఉబ్బసము తొలగించబడును. సర్వైకల్ స్పాండిలైటిస్ కి చాలా చక్కని ఉపయోగకరంగా ఉండును. ఊపిరితిత్తుల వ్యాధులకు చక్కని వ్యాయామం.
2త్రికోణాసనం:
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి చక్కని ఆసనం త్రికోణాసనం.
చేయు విధానం–
ముందుగా రెండు పాదాలు దగ్గర కలిపి నిటారుగా నిల్చునవలెను. తర్వాత రెండు కాళ్ళని రెండు అడుగులు దూరం ఉంచాలి. కుడి చేతిని కుడి చేవికి ఆనుస్తూ చేతిని మీదికి ఎత్తాలి, ఊపిరిని పిలుస్తూ ఆకాశం వైపుకి ఎత్తాలి. ఎడమ భుజము కిందకి ఉండాలి. ఊపిరిని వదులుతూ నెమ్మదిగా ఎడమ చేతి కిందకు తీసుకువెళ్లి అరచెయ్యి భూమి మీద ఆంచాలి. కుడి అరచేయి కింద వైపుకు ఉండి భూమికి సమాంతరంగా ఉండాలి. సాధ్యమైనంతసేపు ఈ భంగిమలోనే ఉండాలి. ఊపిరిని పిలుస్తూ మెల్లమెల్లగా వెనక్కి రావాలి. రెండో వైపు కూడా దీన్ని ఆచరించాలి మణిపూర చక్రము.
దీన్ని చేయటం వలన ప్రయోజనాలు
ఈ ఆసనం చేయడం వల్ల శరీరం తేలిక గా ఉంటుంది.
వెన్నుముకతో పాటు దాని చుట్టూ పక్కల ఉన్న కండరాలు బలపడతాయి. కాళ్లు చేతులు వీపు మెడ అన్ని భాగాలు బలంగా ఉంటాయి
2. స్త్రీ పురుషులకు ఈ ఆసనం చాలా లాభాకారిగా ఉంది.
3. పొత్తి కడుపులోని అవయవాలన్నీ చురుగుగా ఉంటాయి.
5. శరీరంలో వంకరులు దూరమవుతాయి.
6. కండరాలు బలపడి వాటిపైన అక్కరలేని కొవ్వు కరిగిపోతుంది.
7. గుండె ఊపిరితిత్తులు పాంక్రీయాజ్,పెద్ద పేగులు దీనివలన ప్రభావము అవుతాయి..
8. ఊపిరితిత్తుల్లోని గాలిని ఎక్కువ సేపు ఆపగల శక్తి వస్తుంది, దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా ఉంటాయి.
-షేక్ బహర్ అలీ
ఆయుర్వేద వైద్యులు