రెండు కార్లు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
నారాయణపేట (CLiC2NEWS): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం నారాయణపేట్ జిల్లాలోని మక్తల్ సమీపంలోని జాతీయ రాహదారిపై ఆదివారం జరిగింది. అయితే మరణించిన వారు మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.