సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం.. రూ.20 లక్షల వడ్డీలేని రుణం!
భద్రాద్రి (CLiC2NEWS): సింగరేణి కార్మికులకు ఇంటి స్తలం, రూ. 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం భద్రాద్రి, కొత్తగూడెలంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. సింగరేణిలో ఖాళీడా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కార్మికుల వైద్యానికి సూపర్ స్సెషాలిటి హాస్పిటల్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సింగరేణి దినోత్సవం రోజున సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు. అంతేకాకుండా మహిళా కార్మికులకు గని లోపల కాకుండా ఉపరితంలో పని చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
సింగరేణి కార్మికుల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పెద్దపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి తరపున శ్రీధర్‌బాబు ప్రచారం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటి వేస్తామని, ఐఎన్‌టియుసి కార్మిక సంఘాన్ని గెలిపించాలని ఆయన కోరారు.