ఉల్లి, ఇసుకతో శాంతాక్లాజ్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/SAND-SANTACLAUS.jpg)
పూరి (CLiC2NEWS): 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో శాంతాక్లాజ్ శిల్పాన్ని తీర్చిదిద్దారు. అయితే శిల్పం తయారీకి ఏకంగా రెండు టన్నుల ఉల్లిని వినియోగించనట్లు సమాచారం. ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ..పూరిలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ఉల్లిపాయలు, ఇసుకతో ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దాడు. ఈ శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని తెలిపాడు. వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియ ఈ శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది.