సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మెగాస్టార్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సినీ నటుడు చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినందుకు ఆయన అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి సిఎంను కలిశారు.