జియో యూజర్లకు హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ 2024..
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/jio-2024-offer.jpg)
Jio Offer : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తమ యూజర్లకు న్యూ ఇయర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. న్యూఇయర్ ఆఫర్ 2024 పేరిట అదనపు వ్యాలిడిటిని అందిస్తోంది. ఏడాది కాలపరిమితితో ఉన్న రీఛార్జ్ ప్లాన్‌పై ఈ ఆఫర్ అందిస్తోంది. జియో ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు ఈ ఆఫర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం వేచి ఉన్నవారికా ఈ అఫర్ ఉపయోగపడుతుంది. ఇప్పటికే రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటి అందిస్తుంది. అయితే ఈ న్యూఇయర్ ఆఫర్‌తో రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల అదనపు వ్యాలిడిటి పొందవచ్చు. అంటే.. 365 రోజులు కాకుండా 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చు. దీంతో పాలు జియో క్లౌడ్, జియో టివి, జియో సినిమా సంవత్సరం పాటు ఉచితంగా చూడవచ్చు.