ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు: యుజిసి హెచ్చరిక

ఢిల్లీ (CLiC2NEWS): ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదని.. యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక హెచ్చరిక చేసింది. విద్యార్థులు ఎంఫిల్ డిగ్రీలో చేరవద్దని స్పష్టం చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలంటూ యుజిసి అన్ని యూనివర్సిటీలను ఆదేశించింది. ఎంఫిల్ అడ్మిషన్ల కోసం పలు యూనివర్సిటీలు దరఖాస్తులు కోరుతున్నట్లు యూజిసి దృష్టికి రావడంతో.. దీనికి గుర్తింపు లేదని, ఈ ప్రోగ్రామ్ను ఉన్నత విద్యాసంస్థలు నిలిపివేయాలని యుజిసి నిబంధనలు-2022 రెగ్యులేషన్ నంబర్ 14 స్పష్టంగా తెలుపుతుందని యుజిసి తాజా నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరానికి ఎంఫిల్లో ప్రవేశాల ప్రక్రియను నిలిపివేయాలని యూనివర్సిటి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామిన తెలిపింది.