వైఎస్ఆర్‌సిపిలోకి అంబ‌టి రాయుడు

ఆమ‌రావ‌తి (CLiC2NEWS): ప్ర‌ముఖ క్రికెట‌ర్ అంబ‌టి తిరుప‌తి రాయుడు వైఎస్ఆర్‌సిపిలో చేరారు. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో సిఎం జ‌గ‌న్ అంబ‌టి రాయుడికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా అంబ‌టి రాయుడుడ మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో త‌న సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాన‌ని అన్నారు. సిఎం స‌మ‌క్షంలో పార్టీలో జాయినవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. త‌న ప్రాంత ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటు ప‌డ‌తాన‌ని అంబ‌టి రాయుడు అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటి సిఎం నారాయ‌ణ స్వామి, ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.