అనకాపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నులుగురు ఆత్మహత్య..!

అనకాపల్లి (CLiC2NEWS): ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం అనకాపల్లిలో నివసిస్తున్నారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అప్పుల బాధ తాళలేక వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి సైన్‌డ్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.