పాక్లో న్యూఇయర్ వేడుకలపై నిషేధం..

ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో న్యూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ఈ మేరకు దేశ ఆపద్ధర్మ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. గాజా ప్రజలకు సంఘీభావంగా ఈ సంవత్సరం న్యూఇయర్ సెలబ్రేషన్స్పై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్.. పాలస్తీనా ప్రజలకు మద్దతు ప్రకటించింది. ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ గురువారం రాత్రి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. యుద్ధంతో సతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే పాక్ రెండు సార్లు మానవతా సాయం అందించామని.. త్వరలో మరో విడత సాయం పంపిస్తామని తెలిపినట్లు సమాచారం.