అభయ హస్తం దరఖాస్తుల అమ్మకంపై సిఎం రేవంత్ సీరియస్
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/revanth.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రం లో సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభయహస్తం కార్యక్రమంపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. హైదరాబాద్‌లో ప్రజాపాలన కార్యక్రమంపై నిర్వహించిన ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దరఖాస్తులు ఎవరైనా అమ్మితే కఠిన చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన దరఖాస్తు ఫారాలను `ప్రజాపాలన`లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని.. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారే దరఖాస్తు చేసుకోవాలని సిఎం సూచించారు.