అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/amruth-bharath-train-modi.jpg)
అయోధ్య (CLiC2NEWS): ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా అయోధ్యలో రైల్వేస్టేషన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అయోధ్యలో ప్రధాని రెండు అమృత్ భారత్, ఆరు వందే భారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. దీని ముందు అమృత్ భారత్ రైల్ లోకి వెళ్లి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ పర్యటనలో అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఇంటర్ నేషనల్ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ వెంట యుపి సిఎం యోగి ఆధిత్యానద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు ఉన్నారు. అయోధ్య పురవీధుల్లో దాదాపు 15 కి.మీ. మేర ప్రధాని రోడ్‌షోలో పాల్గొన్నారు. అయోధ్య వాసులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.