జనవరి 12 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/TS-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. మిషనరీ పాఠశాలలకు మినమా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి.