గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం ర‌ద్దు.. తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన గృహ‌లక్ష్మి ప‌థ‌కాన్ని కాంగ్రెస్ స‌ర్కార్ ర‌ద్దు చేసింది. ఈ మేర‌కు జిఒను జారీ చేసింది. ఈ ప‌థ‌కం స్థానంలో అభ‌య‌హ‌స్తం పేరుతో రూ. 5ల‌క్ష‌ల ఆర్దిక సాయం ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇంటి స్థ‌లం ఉన్న పేద‌ల‌కు.. గృహ నిర్మాణం కోసం బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం రూ. 3ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందించేందుకు గృహ‌ల‌క్ష్మి పేరుతో ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఇపుడు ఆ ప‌థ‌కం స్థానంలో అభ‌య‌హ‌స్తం పేరుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆర్ధిక సాయం అందించ‌నుంది.

Leave A Reply

Your email address will not be published.