మహబూబ్‌నగర్ జిల్లాలో ఆటోను ఢీకొన్న వాహనం.. ఆరుగురు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/11/accident.jpg)
మహాబూబ్‌నగర్ (CLiC2NEWS): జిల్లాలోని బాలనగర్ చౌరస్తాలో ఆటోను డిసిఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తండా వాసులు బాలనగర్‌లోని సంత నుండి ఆటోలో తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బిబినగర్ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.