Nampally: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/Charminar-express.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఐదో నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన రైలు డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్2, ఎస్ 3, ఎస్ 6 మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రైలు నెమ్మదిగా రావడం వలన ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనకు లోకో పైలట్ తప్పిదం వలన జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వారికి సరైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.