ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త..
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/jobs-in-Indian-Navy.jpg)
Indian Navy: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు నేవీలో లెప్ట్‌నెంట్ హోదాలో ఉద్యోగంతో పాటు ఉచితంగా బిటెక్ చదువుకోవచ్చు. మొత్తం 35 ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. దీనికి అబ్బాయిలు, అమ్మాయిలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఎంపిసి గ్రూప్ చదివిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. మ్యాథ్స్‌లో 70 శాతం మార్కలు.. పదో తరగతి లేదా ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. అభ్యర్థులు జనవరి 2, 2005 నుండి జులై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి.
సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (ఎస్ ఎస్ బి) బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఆఖపట్నంలలో ఎక్కడైనా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జెఇఇ మెయిన్ ర్యాంకు, ఎస్ ఎస్‌బి ఇంటర్వ్యూలతో నియామకాలు జరుగుతాయి. జనవరి 20 తేదీ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in వెబ్‌సైట్ చూడగలరు.
ఎంపికైన విద్యార్థులను జులై నుండి ఇండియన్ నేవల్ అకాడెమి, ఎజిమాల (కేరళ)లో బిటెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో తీసుకుంటారు. చదువుతో పాలు వసతి, భోజనం, పుస్తకాలు అన్ని ఉచితంగా అందిస్తారు. బిటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటి () న్యూఢిల్లీ ఇంజినీరింగ్ డిగ్రీని అందిస్తుంది. అనంతరం వీరు సబ్ లెప్టినెంట్ హోదాలో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. వీరికి లెవెల్ 10 మూలవేతనం రూ. 56,100 చెల్లిస్తారు. మిలటరీ సర్వీస్ పే కొంద రూ. 15,500 అదనంగా అందుతుంది. అంతేకాకుండా డిఎ, హెచ్ ఆర్ె, ఇతర అలవెన్సులు తో కలిపి గరిష్టంగా ఒక లక్ష వరకు అందుతుంది. వీరికి ఏడాదికి 60 వార్షిక సెలవుతు, 20 సాధారణ సెలవులు ఉంటాయి.