రెండు సార్లు మనల్ని గెలిపించింది ప్రజలే.. కెటిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/KTR-SPEACH-IN-BRS-MEETING.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బిఆర్ ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పాలనపై దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదని.. అందుకు బాధ్యత తనదేనన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీని నడపడం సరికాదన్నారు. ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారని అనటం సరికాదని.. ఆ ప్రజలే మనల్ని రెండు సార్లు గెలిపించారని మర్చిపోవద్దన్నారు. వారు పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు.. 14 చోట్ల మన ఎమ్మెల్యే అభ్యర్థులు కేవలం అతి తక్కువ తేడాతో ఓడిపాయారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో దళితబంధు కొందరికే రావడం.. మిగతావారు వ్యతిరేకులవడానికి కారణమైందన్నారు. అంతే కాకుండా ఈ పథకంపై ఇతర కులాల్లోనూ వ్యతిరేకత వెల్లువెత్తింది. భూస్వాములకు రైతుబంధు ఇవ్వడాన్ని చిన్న రైతులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని కెటిఆర్ అన్నారరు.