అయోధ్య రామమందిరానికి ‘హను-మాన్’ టీమ్ విరాళం..
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/HANUMAN-MOVIE.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఆయోధ్య రామ మందిర నిర్మాణానికి హనుమాన్ చిత్ర టీమ్ రూ.14.25 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. టికెట్‌కు రూ. 5 చొప్పున విరాళంగా ఇస్తామని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పారు. దానిలో భాగంగా ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ. 14.25 లక్షలను విరాళంగా ఇవ్వనున్నట్లు సమాచారం. సినిమా ప్రదర్శితమైనంత కాలం విరాలం ఇవ్వనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం చిత్రంతో పాటు తేజ నటించిన హనుమాన్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.