ముంబయి ఉగ్రదాడి సూత్రధారి మృతి..!
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/Terrorist-Salam-Bhuttavi-is-dead.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): ముంబయి ఉగ్రదాడి సూత్రధారి అబ్దుల్ సలాం భుట్టవి మృతి చెందినట్లు ఐక్కరాజ్యసమితి ధ్రువీకరించింది. లష్కరే తోయిబా డిప్యూటి చాఫ్ హఫీజ్ అబ్దుల్ సలాం భుట్టవి పాకిస్తాన్‌లోని మార్కడే జైలులో ప్రభుత్వ కస్టడీలో ఉన్నాడు. గతేడాది మే 29న గుండెపోటుతో మృతి చెందినట్లు యుఎన్ భద్రతామండలి అల్‌ఖైదా ఆంక్షల కమిటి తాజాగా వెల్లడించింది.
2008 ముంబయి దాడుల తర్వాత లష్కరే తోయిబా చీఫ్‌గా సలాం భుట్టవి వ్యవహించాడు. ఆ సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌ను నిర్భందించిన సందర్భాలలో ఇతడే సంస్థను నడిపించినట్లు సమాచారం. ముంబయి దాడుల అనంతరం సయీద్ ఆజ్ఞాతంలోకి వెళ్లగా భుట్టవికి కీలక వ్యక్తిగా వ్యవహరించాడు. సయీద్ ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వ కస్టడీలోనే ఉన్నట్లు ఐక్కరాజ్యసమితి పేర్కొంది. 2020 ఫిబ్రవరి 12 నుండి సయీద్ కారాగారంలోనే ఉన్నట్లు యుఎన్ తెలిపింది. మొత్తం 7 ఉగ్ర దాడులకు సంబంధించిన కేసుల్లో అతడు 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం.