బిటెక్, బిఇ అర్హతతో రిలయన్స్‌లో ఉద్యోగాలు..
![](https://clic2news.com/wp-content/uploads/2021/06/EXAMS.jpg)
Reliance jobs: ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్.. తమ కంపెనీలోని వివిధ విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించనుంది. రిలయన్స్‌కు చెందిన వివిద వ్యాపార విభాగాల్లో బిటెక్, బిఇ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ ప్రోగ్రామ్‌లో భాగంగా జనవరి 11 నుండి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. షార్ట్ లిస్ట్ చేసిన విద్యార్థులకు వచ్చే నెల 5 నుండి 8 వరకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఎంపికైన వారికి ఫిబ్రవరి 23 నుండి మార్చి 11 వరకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేస్తారు. మార్చి నెలాఖరుకు ఈ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది.