కల్వర్టులో బోల్తాపడ్డ మూడు వాహనాలు .. ఇద్దరు మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు కల్వర్టులో పడిపోయి ఇద్దరు మృతి చెందారు. షున్నిమియాగూడ సమీపంలో రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంటలో కారు, ఆటో, బైక్ పడిపోయాయి. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తి, మహిళ మృతి చెందారు. బైక్‌మీదన్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.