ఎపి పిసిసి అధ్యక్ష పదవికి గిడుగు రాజీనామా..
వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్?
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/Gidugu-rudraraju.jpg)
విజయవాడ (CLiC2NEWS): ఎపి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపారు. కాగా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలకు గత కొంత కాలంగా ఎపి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్రగిస్తారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుద్రరాజు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. గతంలో రుద్రరాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాగే యుపి కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడిగా కూడా వ్యవహరించారు.