చిరంజీవి 156 చిత్రం టైటిల్ `విశ్వంభర`
కాన్సెప్ట్ విడియోను విడుదల చేసిన చిత్రబృందం
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/vishwambhara.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్ అగ్రహీరో, మెగాస్టార్ చిరంజీవి 156 చిత్రం పేరు `విశ్వంభర`గా ఖరారు చేశారు. చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం గత సంవత్సరం విజయదశమి రోజు `విశ్వానికి మించి` అనే పోస్టర్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కాగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూవీ టైటిట్‌ను సోమవారం ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ విడియోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
`బింబిసార` వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండటం.. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతుండటంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాన్సెప్ట్ విడియోను పరిశీలిస్తే ఇది సోషియో ఫాంటసీ సినిమా అని అర్థమవుతోంది. కాగా ఈ విడియో చూసిన మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.