పతంగులు ఎగురవేస్తూ విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు!
కోరుట్ల (CLiC2NFEWS): జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో కల్లూరుకు చెందిన 12 సంవత్సరాల ఇద్దరు చిన్నరులు గాలిపటం ఎగురవేస్తూ కరెంటు షాక్‌కు గురయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురువేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర షాక్ కు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారు. భవనం పై నుంచి కిందకు పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరి శరీరం సగ భాగం కాలిపోయింది. మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఇద్దరు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.