సత్యసాయి జిల్లాలో ‘నాసిన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
సత్యసాయి (CLiC2NEWS): ఎపిలోని సత్యసాయి జిల్లాలో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమి (నాసిన్)ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడా ఈ జిల్లాలోనే ఉందని.. ఈ జిల్లాలో నాసిన్ ఏర్పాటు చేయడం.. ఇది ప్రముఖ శిక్షణా సంస్థగా, సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుందన్నారు. గాంధీజీ అనేక సార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించేవారిన.. రామరాజ్యంలో అందినట్లు సుపరిపాలన అందాలని ఆయన చెప్పారన్నారు. సుపరిపాలన అంటే బలహీనులకు అండంగా ఉండటమని మోడీ తెలిపారు.
రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ సరళంగా ఉండేదని.. భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా మారినట్లు పన్నుల విధానం ఉండలన్నారు. జిఎస్‌టి రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామని.. ఆదాయపన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామన్నారు. వచ్చే ఆదాయంతో దేశంలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ పదేళ్లలో పన్ను రాబడి పెరిగిందని.. దాంతో అనేకమైన పెండింగ్ పనులు పూర్తి చేశామని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.