దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, గరవ్నర్, కెసిఆర్, జగన్
హైదరాబాద్ : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళసై, తెలంగాణ సిఎం కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ జగన్ ఆదివారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి కోవింద్: `‘దసరా సందర్భంగా తోటి పౌరులకు శుభాకాంక్షలు. ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. పండుగ మహమ్మారి చెడు ప్రభావాల నుంచి మనల్ని కాపాడుతుంది. దేశ ప్రజలకు శేయస్సు, సంపదను తీసుకువస్తుంది.“
Greetings and good wishes to fellow citizens on Dussehra. This festival symbolises the triumph of good over evil. May this festival of joy and happiness protect us from the evil effects of the ongoing pandemic and bring prosperity and affluence to the people of the country.
— President of India (@rashtrapatibhvn) October 25, 2020
ప్రధాని మోడీ:
‘దేశ ప్రజలందరికీ అభినందనలు. చెడుపై మంచి విజయాన్ని సాధించిన గొప్ప పండుగ అనీ, ప్రతి ఒక్కరి జీవితాన్ని కొత్త స్ఫూర్తిని తెచ్చిందంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు నవరాత్రి వేడుకల్లో దుర్గామాత తొమ్మిదో రోజు సిద్ధిదాత్రిగా పూజలందుకుంటుంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తమ పనుల్లో విజయం సాధించాలి.“
सभी देशवासियों को विजयादशमी की ढेर सारी शुभकामनाएं। बुराई पर अच्छाई और असत्य पर सत्य की जीत का यह महापर्व हर किसी के जीवन में नई प्रेरणा लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 25, 2020
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు{
విజయదశమి (దసరా) పండుగ శుభసందర్భంలో దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి. అయితే ఈ ఏడాది కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశ ప్రజలంతా దసరా పండుగను కోవిడ్ నియమనిబంధనలకు అనుగుణంగా, ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కుటుంబసభ్యులతో కలిసి ఇంటివద్దనే జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను. ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. #Dussehra #HappyDussehra“ అని ట్విట్టర్లో ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమి (దసరా) పండుగ శుభసందర్భంలో దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ%
Comments are closed.