అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేరు..

న్యూఢిల్లీ: ద‌స‌రా పండుగ సందర్భంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ఆయుధ పూజ నిర్వహించారు. సిక్కిం షెరాథాంగ్‌ వద్ద ఆయన సైనికులతో ‘శాస్త్ర పూజ’ నిర్వ‌హించారు. ఈ ప్రాంతం కేవలం వాస్తవాధీన రేఖకు కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉంది. చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ సైనికులతో గడపటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్క‌డ రాజ్‌నాథ్ ఆయుధాలు, పరికరాలు, సాయుధ వాహనాలను పూజించారు. అనంతరం సైనికులతో రాజ్‌నాథ్ కాసేపు గ‌డిపారు. దసరా సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ… చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న వివాదం త్వరగా ముగిసిపోవాలని భారత్‌ కోరుకుంటోందని ఆకాంక్షించారు. భారత జవాన్లు దేశంలోని ఒక్క అంగుళం భూమిని కూడా ఎవ‌రూ ఆక్ర‌మించుకోలేద‌ని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

 

situs slot

Leave A Reply

Your email address will not be published.