ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ ష‌ర్మిల‌..

ఢిల్లీ (CLiC2NEWS): ఎపి పిసిసి అధ్య‌క్షురాలిగా వైఎస్ ష‌ర్మిల‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి రానున్న‌ట్లు స‌మాచారం. ఎపి రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన గిడుగు రుద్ద‌రాజును సిడ‌బ్ల్యుసి ప్ర‌త్యేక ఆహ్వానితునిగా నియ‌మించింది. పిసిసి అధ్య‌క్షురాలిగా నియ‌మించ‌డంపై ష‌ర్మిల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంర్భంగా పార్టి జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీకి కృత‌జ్ఞత‌లు తెలియ‌జేశారు. రాష్ట్రంలో పార్టీ పున‌రుద్ద‌ర‌ణ‌కు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని తెలిపారు.

వైఎస్ ష‌ర్మిత‌ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆమె పార్టీలో చేరిన‌పుడే ఎపి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.