హైదరాబాద్‌లోని ఐసిఎఆర్‌లో రిసెర్చ్ పోస్టులు
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/jobs-notification-copy-750x313.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రాజేంద్రగనర్‌లోని ఐకార్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చ్ ఐసిఎఆర్‌లో ఒప్పంద ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. జూనియర్ రిసెర్చ్ ఫెలో 3 పోస్టులు, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రిసెర్చ్ అసోసియోట్ పోస్టులు ఒకటి చొప్పున ఉన్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి బిఎస్సి, ఎమ్మెస్సి, నెట్, పిహెచ్డి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు 18 నుండి 26 ఏళ్ల వయస్సు ఉండాలి. మిగిలిన పోస్టులకు పురుష అభ్యర్థులకు 21 నుండి 35 వరకు.. మహిళలకు 21 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిసెర్చ్ అసోసియేట్‌కు రూ. 54,000, జెఆర్ ఎఫ్‌కు రూ. 31,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్‌కు రూ. 20,000 వరకు వేతనం ఉంటుంది. ఇంటర్వ్యూలకు చివరితేదీ జనవరి 24.