పవన్‌కల్యాణ్‌ను కలిసిన వైఎస్ షర్మిల

హైదరాబాద్ (CLiC2NEWS): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వైఎస్ షర్మిల బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కుమారుడు వివాహానికి హాజరుకావాలని ఆహ్వానపత్రికను పవన్‌కు అందించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా నియమితులైనందుకు షర్మిలకు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. కాబోయే వధువరుల గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.