ఎపిలో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఎపిలో ఈ నెల 22వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.