శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.41 కోట్ల హెరాయిన్ ప‌ట్టివేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్ర‌యంలో ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలి వద్ద భారీ మొత్తంలో హెరాయిన్‌ను గుర్తించారు. దాని విలువ సుమారు రూ. 41 కోట్ల విలువ ఉంటుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. మొత్తం 5.92 కిలోల హెరాయిన్‌ను క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌యాణికురాలు జాంబియాకు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. డాక్యుమెంట్ ఫోల్డ‌ర్‌లో హెరాయిన్ ఉంచిన‌ట్లు తెలిపారు. ఆమెపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.