రాజ‌కీయాల నుండి వైదొల‌గిన‌ గుంటూరు ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్

గుంటూరు (CLiC2NEWS): ఎంపి గ‌ల్లా జ‌య‌దేవ్ రాజకీయాల నుండి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది తాత్కాలిక‌మేన‌ని, వ‌న‌వాసం త‌ర్వాత శ్రీ‌రాముడు, పాండ‌వులు వ‌చ్చినంత బలంగా తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ఆయ‌న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ప‌రిస్థితుల్లో మౌనంగా ఉండ‌లేక‌.. నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జ‌య‌దేవ్ తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్ల‌మెంట్‌లో మౌనంగా ఉండ‌లేన‌ని, నాప‌ని నిర్వ‌ర్తించ‌లేక‌పోతున్నాన‌న్నారు. మ‌ళ్లీ పోటీ చేసినా గెలుస్తాన‌ని, కానీ రాజ‌కీయాల్లో ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

జ‌య‌దేవ్ తండ్రి రెండేళ్ల క్రితం వ్యాపారాల నుండి రిటైర్ అయ్యార‌ని, ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం, వ్యాపారం.. రెండింటినీ స‌మ‌న్య‌యం చేయ‌డం క‌ష్టంతో కూడిన‌ద‌న్నారు. అందుకే రాజ‌కీయాల‌ను వ‌దిలేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.పార్ల‌మెంట్‌లో రాష్ట్ర స‌మ‌స్య‌లు, ప్ర‌త్యేక హోదా కోసం పారాడ‌న‌ని, రాజ‌ధానిగా అమ‌రావ‌తికే మ‌ద్ధ‌తిస్తానన్నారు. ప్ర‌భుత్వం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌పుడు అవిశ్వాసం పెట్టారు. ఆ స‌మ‌యంలో పార్టీ గొంతు తనే వినిపించాన‌ని, దీనిని దృష్టిలో పెట్టుకుని వివిధ కేసుల్లో ఇడి రెండు సార్లు పిలిపించిన‌ట్లు వెల్ల‌డించారు. త‌న వ్యాపారాల‌న్నీ నిఘా ప‌రిధిలోనే ఉన్న‌ట్లు జ‌య‌దేవ్ తెల‌పారు.

Leave A Reply

Your email address will not be published.