ఫిల్మ్‌ఫేర్ 2024: రణబీర్ ఉత్తమ నటుడు.. `12th ఫెయిల్` ఉత్తమ చిత్రం

గాంధీనగర్ (CLiC2NEWS): 2024 సంవత్సరానికి సంబంధించిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిర్వహకులు ప్రకటించారు. ఈ అవార్డులను హిందీ చిత్రసీమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సారి ఈ పురస్కారాలను గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా ప్రకటించారు. ఎంతో అట్టహాసంగా సాగిన ఈ వేడుకలో 2023 లో విడుదల అయిన చిత్రాలకు ఈ పురస్కారాలను అందించారు.
వీటిలో క్యూట్ జంట రణబీర్ కపూర్, ఆలియాభట్ జంట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకోగా.. 12th ఫెయిల్ చిత్రం ఉత్తమచిత్రంగా నిలిచింది.
అవార్డుల వివరాలు..
- ఉత్తమ చిత్రం- 12th ఫెయిల్
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) – జొరామ్
- ఉత్తమ దర్శకుడు – విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్ )
- ఉత్తమ నటుడు – రణ్‌బీర్ కపూర్ (యానిమల్)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్ )
- ఉత్తమ నటి – ఆలియా భట్ (రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్)- రాణి ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే) షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
- ఉత్తమ సహాయ నటుడు – విక్కీ కౌశల్ (డంకీ)
- ఉత్తమ సహాయ నటి – షబానా ఆజ్మీ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
- ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. జరా హత్కే జర బచ్కే)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బం – యానిమల్
- ఉత్తమ నేపథ్య గాకుడు – భూపిందర్ బాబల్ (అర్జన్ వెయిలీ -యానిమల్)
- ఉత్తమ నేపథ్య గాయకురాలు – శిల్పారావు (చెలియ – జవాన్)
- ఉత్తమ కథ – అమిత్ ఆయ్ (OMG 2)
- ఉత్తమ స్క్రీన్ ప్లే – విధే వినోద్ చోప్రా (12th ఫెయిల్ )
- ఉత్తమ డైలాగ్ – ఇషితా మెయిత్రా (రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ)
- ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – హర్సవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
- ఉత్తమ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్ )
- ఉత్తమ కొరియో గ్రఫి – గణేశ్ ఆచార్య (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ)
- ఉత్తమ నూతన దర్శకుడు – తరుణ్ దుడేజా (ధక్ ధక్)
- ఉత్తమ నూతన నటుడు – ఆదిత్య (ఫరాజ్)
- ఉత్తమ నూతన నటి – అలిజె అగ్నిహోత్రి (ఫారే)
- జీవిత సాఫల్య పురస్కారం – డేవిడ్ ధావన్