స్కూల్‌బ‌స్సు దిగిన చిన్నారి.. అదే బ‌స్సు టైరు కింద‌ప‌డి మృతి

మెద‌క్ (CLiC2NEWS): మెద‌క్ ప‌ట్ట‌ణ ప‌రిధిలోని హౌసింగ్ బోర్డు కాల‌నీలో స్కూల్ బ‌స్సు కింద ప‌డి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. స్థానిక మాస్ట‌ర్ మైండ్ స్కూల్‌లో ఒక‌టో త‌ర‌గ‌తి చ‌దువుతున‌న అనుశ్రీ ఎప్ప‌టిలాగే సాయంత్రం ఇంటి వ‌ద్ద బ‌స్సు దిగింది. బ‌స్సు ముందునుంచి వెళ్తున్న క్ర‌మంలో డ్రైవ‌ర్ గ‌మ‌నించ‌క‌పోవ‌డంతో బ‌స్సు టైరు కింద ప‌డి ప్రాణాలు కోల్పోయింది. బ‌స్సు డ్రైవ‌ర్‌, క్లీన‌ర్ ప‌రారీలో ఉన్నారు. చిన్నారి త‌ల్లి దండ్రులు బొంత‌ప‌ల్లిలో ఉంటారు. ఆమె పిన్ని, బాబాయి వ‌ద్ద ఉంటూ ఒకటో త‌ర‌గ‌తి చదువుతుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే గాయ‌ప‌డిన చిన్నారిని స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెల‌పారు. డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే చిన్నారి మృతి చెందింద‌ని.. స్థానికులు బ‌స్సు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.