రైల్వేలో 5,600 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు..

Railway jobs: రైల్వే శాఖలోని వివిధ జోన్లలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు వచ్చేనెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వయస్సు 18 నుండి 33 ఏళ్ల లోపు ఉండాలి. గతంలో వయోపరిమితి 30 ఏళ్లుగా ఉంది.. దీనిని 33 ఏళ్లకు పెంచారు. దీని ప్రకారం జులై 1.2024 నాటికి 18-33 ఏళ్లలోపు వయస్సు ఉన్న వారికి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలగుతుంది. మొదటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-I) జూన్-ఆగస్టు మధ్య, రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2) సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.