రాజకీయాల్లోకి మరో సినీ హీరో..

చెన్నై (CLiC2NEWS): ప్రముఖ కోలివుడ్ హీరో దళపతి విజయ్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తమిళగ వెట్రి కళగం పేరుతో విజయ్ తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతుందని, దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదని, ఇతర పార్టీలకు మద్దతుకూడా ఇవ్వమన్నారు. 2026లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని, మాపార్టి జెండా, అజెండాను త్వరలో ప్రకటిస్తామన్నారు.