యాదాద్రి ఎస్సి బాలికల వసతి గృహంలో ఇద్దరు బాలికల బలవన్మరణం

భువనగిరి (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి ఎస్సి బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదోతరగతి చుదవుతున్న బాలికలు శనివారం పాఠశాలకు వెళ్లి, సాయంత్రం తిరిగి వసతి గృహానికి వచ్చారు. అనంతరం అక్కడి ట్యూషన్‌కు, భోజనానికి కూడా రాకపోవడంతో తోటి విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఆ ఇద్దరు రెండు ఫ్యాన్లకు ఉరేసుకొని ఉన్నారు. వెంటనే వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన బాలికలు రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వసతి గృహంలో విద్యార్థినుల మధ్య జరిగినవే గొడవే కారణంగా బాలికలు ఆత్యహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.