హుక్కా కేంద్రాలపై నిషేధం.. రాష్ట్ర సర్కార్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం హుక్కు కేంద్రాలపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. మాదక ద్రవ్యాల వ్యసనం నుండి యువతను రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిబ్రవరి 4వ తేదీన జరిగిన మంత్రివర్గం సమావేశంలో హుక్కా కేంద్రపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నా.. అసెంబ్లీలో తాజాగా అధికారిక ప్రకటన చేశారు.