చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీశ్ కాంగ్రెస్‌లోకి రావాలి.. రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ ఎస్‌లో ఉన్నా హరీశ్‌రావుకి ప్రయోజనం లేదని.. కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీశ్‌రావు .. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టి అని అన్నారు. బిఆర్ ఎస్ హయాంలో చేసిన పాపాలను కడుక్కోవడానికి ఆయనకు దేవాదాయ శాఖ ఇస్తామన్నారు. దీని కోసం 25 మంది బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీలోకి రావాలని షరతు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని బిఆర్ ఎస్ చీప్ పాలిటిక్స్ చేస్తుందని.. అది మానుకోవాలన్నారు. మేం పదువుల కోసం పాకులాడే వాళ్లం కాదని.. ఉద్యమ సయయంలో పదువులను వదులుకున్న చరిత్రమాదన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని, రాష్ట్రాన్ని కెసిఆర్ నాశనం చేశారన్నారు. హరీశ్ మా పార్టీలోకి రమ్మంటున్నామని, అక్కడ ఆయనకు భవిష్యత్ లేదన్నారు.