తండాల్లో పాఠ‌శాల‌లు నిర్మించే బాధ్య‌త మాదే: సిఎం

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని బంజారాభ‌వ‌న్‌లో నిర్వ‌హించిన సంత్ సేవాలాల్ జ‌యంతి ఉత్స‌వాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. బంజారా సోద‌రుల‌తో స‌మావేశ‌మంటే కాంగ్రెస్ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసినంత ఆనంద‌మ‌న్నారు. మీ ఆశీర్వాదంతో ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డిందని.. సేవాలాల్ జ‌యంతిని ఆప్ష‌న‌ల్ హాలిడేగా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిద‌న్నారు. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు రూ. 2 కోట్లు విడుద‌ల చేస్తున్నామ‌ని తెలిపారు. 1976 లో బంజారాల‌ను ఎస్‌టి జాబితాలో ఇందిరాగాంధీ చేర్చార‌ని, దామాషా ప్ర‌కారం నిధులు కేటాయించిన ఘ‌న‌త సోనియాగాంధీద‌న్నారు.

రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠ‌శాల‌లు నిర్మించే బాధ్య‌త‌ను తీసుకుంటామ‌ని, అన్ని తండాలకు బిటి రోడ్డు వేసే బాధ్య‌త కూడా త‌మ‌దేన‌ని హామీ ఇచ్చారు. విద్యుత్‌, తాగునీరు.. ఇలా ఏ స‌మ‌స్య ఉన్నా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌న్నారు. చ‌దువుకుంటేనే స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంద‌ని, ఆ బాట ప‌ట్టి.. పంత్ సేవాలాల్ మార్గంలో న‌డ‌వాల‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.